Putin : భారతీయులు ప్రతిభావంతులు – పుతిన్
భారత్ పై రష్యా ప్రెసిడెంట్ ప్రశంసల జల్లు
Putin : రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయులు అత్యంత ప్రతిభావంతులు అంటూ కితాబు ఇచ్చారు. రష్యా ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ కీలక ప్రసంగం చేశారు. ఈ మేరకు భారత్ పట్ల ఆయన తన అభిప్రాయాన్ని మరోసారి పంచుకున్నారు.
భారతీయులు ఎక్కడైనా రాణిస్తారని, వారి ప్రతిభా పాటవాలు తనను విస్తు పోయేలా చేశాయని పేర్కొన్నారు. వాళ్లు ఏ పరిస్థితుల్లోనైనా సర్దుకు పోతారని, ఇది మిగతా దేశాల వారికి అలా ఉండదన్నారు. భారతీయులు ఈ మధ్య మరింత శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
అభివృద్ది పరంగా భారతదేశం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఒకటిన్నర బిలియన్ల ప్రజలు కష్టపడేందుకు సిద్దంగా ఉండడాన్ని మనం నేర్చు కోవాలని సూచించారు పుతిన్(Putin). ఓ వైపు రష్యా ఉక్రెయిన్ విషయంలో దాడికి పాల్పడుతున్నా భారత్ వ్యూహాత్మకంగా మౌనం పాటించడాన్ని అమెరికా తప్పు పట్టింది.
దానిని భారత్ తీవ్రంగా వ్యతికించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పుతిన్. ఒక రకంగా భారత్ తో రష్యాకు దగ్గరి సంబంధం ఉందన్నారు. కొన్ని తరాల నుంచి ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు కొనసాగుతూ వచ్చాయని చెప్పారు వ్లాదిమిర్ పుతిన్. మరో వైపు ఆఫ్రికాలో వలస వాదం గురించి ప్రస్తావించారు.
పాశ్చాత్య సామ్రాజ్యాలు ఆఫ్రికాను దోచుకున్నాయని ఆరోపించారు పుతిన్. రష్యా కావాలని ఉక్రెయిన్ పై యుద్దం చేయడం లేదన్నాడు రష్యా అధ్యక్షుడు. తాము శాంతిని కోరుకున్నామని కానీ కావాలని తనతో కయ్యానికి కాలు దువ్విందన్నాడు.
Also Read : ఎలాన్ మస్క్ పై జో బైడన్ కన్నెర్ర