Dhan Singh Rawat : ఉత్తరాఖండ్ లో హిందీలో మెడికల్ కోర్సులు
2023 నుండి హిందీలో ఎంబీబీఎస్
Dhan Singh Rawat : దేశ వ్యాప్తంగా హిందీని అధికార భాషగా అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక్కో రాష్ట్రం అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఇక వచ్చే ఏడాది 2023 నుండి హిందీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించేందుకు ఉత్తరాఖండ్ రెడీ అయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఒక వేళ ఇది అమలు చేస్తే దేశంలో రెండో రాష్ట్రంగా మారుతుంది. ఇదిలా ఉండగా హిందీకి కేంద్రం ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాస్ట్ర విద్యా శాఖ మంత్రి స్పష్టం చేశారు. హిందీలో ఎంబీబీఎస్ కోర్సు ఉత్తరాఖండ్ లో తదుపరి అకడమిక్ సెషన్ నుండి ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
మొత్తం మెడికల్ కోర్సులకు సంబంధించి హిందీతో పాటు ఇంగ్లీష్ లో కూడా బోధించనున్నట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి ధన్ సింగ్(Dhan Singh Rawat) స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదన్నారు. సీట్లు వచ్చిన విద్యార్థులు వారి అభీష్టం మేరకు ఏ మాధ్యమంలోనైనా చదువుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో తాము ఎవరినీ ఇబ్బంది పెట్టడమో లేదా బలవంతం చేయడం ఉండదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
పౌరి జిల్లాలోని శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సిఎంఎస్ రావత్ ఈ ప్యానల్ కు నేతృత్వం వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ అరెస్ట్ – ఈడీ