Kiren Rijiju : కొలీజియం కాదు స‌మ‌ర్థులైన జ‌డ్జీలు కావాలి

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు

Kiren Rijiju : కొలీజియంపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju). కొలీజియం వ్య‌వ‌స్థ ఒక్క భార‌త్ లోనే ఉంద‌ని ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా లేద‌న్నారు. తాజాగా ఈ దేశానికి కావాల్సింది క‌లీజియం వ్య‌వ‌స్థ కాద‌ని స‌మ‌ర్థులైన న్యాయ‌మూర్తులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గ‌త కొంత కాలం నుంచీ న్యాయ వ్య‌వ‌స్థ తీరుపై తీవ్ర అసహ‌నంతో ఉన్నారు కిరెన్ రిజిజు. తాజాగా మ‌రోసారి న్యాయ వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా తాను న్యాయ వ్య‌వ‌స్థ‌ను లేదా న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించ‌డం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి కోలీజియం వ్య‌వ‌స్థ ప‌ట్ల తాను సంతోషంగా లేన‌ని స్ప‌ష్టం చేశారు కిరెన్ రిజిజు. ఏ వ్య‌వ‌స్థ పరిపూర్ణంగా లేద‌న్నారు. మ‌నం ఎల్ల‌ప్పుడూ మెరుగైన వ్య‌వ‌స్థ కోసం కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. న్యాయ శాఖ మంత్రిగా ఉన్న త‌న‌కే ఒక్కోసారి చిరాకు క‌లిగించే స‌న్నివేశాలు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ కొలీజియం వ్య‌వ‌స్థ గురించి దేశ ప్ర‌జ‌ల‌కు ఎవరికైనా తెలుసా అని ప్ర‌శ్నించారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). ఇందులో పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. న్యాయ వ్య‌వస్థ‌లో తీవ్ర‌మైన రాజ‌కీయాలు ఉన్నాయ‌ని, కాగా న్యాయ‌మూర్తులు దానిని చూపించ‌క పోవ‌చ్చ‌న్నారు.

ముంబైలో జ‌రిగిన ఇండియా టుడే చేప‌ట్టిన రిఫార్మింగ్ జ్యుడీషియ‌రీ అనే అంశంపై ఆయ‌న మాట్లాడారు.

Also Read : ఉత్త‌రాఖండ్ లో హిందీలో మెడిక‌ల్ కోర్సులు

Leave A Reply

Your Email Id will not be published!