Supreme Court : 10 శాతం ఈడ‌బ్ల్యుఎస్ రిజ‌ర్వేష‌న్లు స‌బ‌బే

కీల‌క తీర్పు వెలువ‌రించిన ధ‌ర్మాస‌నం

Supreme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దేశ వ్యాప్తంగా కీల‌కంగా మారిన ఆర్థికంగా వెనుక‌బ‌డిన పేద‌ల‌కు రిజర్వేష‌న్ అమ‌లు చేయాల‌న్న దానిపై దాఖ‌లైన పిటిష‌న్ పై(Supreme Court) సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటాను అమ‌లు చేయాల‌న్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించి భార‌త రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ ప్ర‌కారం ఇది స‌మ్మ‌త‌మేన‌ని ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పు వెలువ‌రించింది.

ఇదిలా ఉండ‌గా ఈడ‌బ్ల్యుఎస్ అమ‌లు పై జ‌రిగిన విచార‌ణ‌లో న‌లుగురు న్యాయ‌మూర్తులు స‌మ‌ర్థించ‌గా ఒక న్యాయ‌మూర్తి మాత్రం దానిని వ్య‌తిరేకించారు.

దీనిని అమ‌లు చేయ‌డం వ‌ల్ల న్యాయం జ‌రుగుతుంద‌ని అంటే కాదు ప్ర‌తిభావంతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతున్నా, ఇంకా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని అనుకోవ‌డం పాల‌కుల వైఫ‌ల్య‌మేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి లేవ‌నెత్తిన ఈ అంశం ఆలోచించాల్సిన అంశం. ఒక‌వేళ పాల‌కులు స‌రైన దిశ‌గా ప‌ని చేసి ఉంటే ప్ర‌జ‌ల మధ్య అంత‌రాలు ఉండేవి కావు. స‌మాన‌త్వ‌పు హ‌క్కు ఇక్క‌డ అత్యంత ప్ర‌ధానం. కానీ ఎక్క‌డా లేదు ఒక్క రాజ్యాంగంలో త‌ప్ప‌. ఇదే స‌మ‌యంలో వెలువ‌రించిన తీర్పులో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆర్థిక‌వ‌గా వెనుక‌బ‌డిన వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం వ‌ల్ల ఇత‌రుల ప‌ట్ల వివ‌క్ష చూప‌డం కాద‌ని , ఈ కోటాతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌ని కోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

Also Read : మారిన ‘గులాం’ స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!