EWS Quota : పాల‌కుల వైఫ‌ల్యం పేద‌ల‌కు శాపం

సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

EWS Quota : దేశ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిని, ఉత్కంఠ‌ను రేపిన పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించే అంశంపై చివ‌ర‌కు కొలిక్కి తీసుకు వ‌చ్చింది సుప్రీంకోర్టు. ఈ మేర‌కు ఆర్థికంగా పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్(EWS Quota) సౌక‌ర్యం క‌ల్పించ‌డం వ‌ల్ల స‌మాజానికి, దేశానికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని పేర్కొంది.

ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు కీల‌క తీర్పు వెలువ‌రించింది. పాల‌కుల వైఫ్య‌లం, అనాలోచిత నిర్ణ‌యాలు, లెక్క‌లేన‌న్ని సంక్షేమ ప‌థకాలు, స‌బ్సిడీలు, వ్యాపార‌వేత్త‌ల‌కు తాయిలాలు, వ‌న‌రుల‌ను తాక‌ట్టు పెట్ట‌డం వల్లే ప్ర‌జ‌ల మ‌ధ్య అంత‌రాలు పెరిగి పోయాయి.

వారికి రావాల్సిన అవ‌కాశాలు పొంద‌డం లేదు. దీనిపై గ‌త కొంత కాలంగా వాదోప‌వాద‌న‌లు చెల‌రేగుతూ వ‌చ్చాయి. సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆర్థిక ప్ర‌మాణాల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం ప్రాథ‌మిక నిర్మాణాన్ని ఉల్లంఘించ లేద‌ని స్ప‌ష్టం చేసింది.

భార‌త దేశం లోని నిమ్న కులాలు అని పిలిచే పేద వ‌ర్గాల‌కు అన్ని కాలేజీలు, ప్ర‌భుత్వ ఉద్యోగాల‌లో 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను వ‌ర్తింప చేయ‌డం స‌బబే అని ధ‌ర్మాస‌నం అభిప్రాయ ప‌డింది. ఇదిలా ఉండ‌గా ధ‌ర్మాస‌నంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల‌లో ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు విభేదించారు.

వారిలో సీజేఐ యుయు ల‌లిత్ , జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్ ఉన్నారు. రిజ‌ర్వేష‌న్ అనది రాజ్యాంగం ప్రాథ‌మిక నిర్మాణాన్ని ఉల్లంఘించ‌దు. 15(4), 16(4) స‌మానత్వ కోడ్ ను ఉల్లంఘిచ‌ద‌ని పేర్కొంది. ప్రాథ‌మిక నిర్మానాన్ని దెబ్బ తీయ‌ద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.

ఆర్థికంగా వెనుక‌బడిన త‌ర‌గ‌తి (ఈడబ్ల్యుఎస్) కోసం రిజ‌ర్వేష‌న్లు 50 శాతం సీలింగ్ పరిమితి కార‌ణంగా రాజ్యాంగ ప్రాథ‌మిక నిర్మాణాన్ని ఉల్లంఘించ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా అస‌మాన‌త‌ల‌ను స‌మానంగా చూడ‌డం రాజ్యాంగంలోని స‌మాన‌త్వాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది.

Also Read : మోదీ వైఫ‌ల్యం వ‌ల్లే ఆర్థిక ప‌త‌నం – ఖ‌ర్గే

Leave A Reply

Your Email Id will not be published!