Jharkhand CM : మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు ఊరట
ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టు
Jharkhand CM : అక్రమ మైనింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు జారీ చేసిన సమయంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు భారీ ఊరట లభించింది. సోమవారం సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. ఇదిలా ఉండగా సీఎం సోరేన్ తనంతకు తానుగా మైనింగ్ కాంట్రాక్టు లీజుకు తీసుకున్నారంటూ బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ లేఖ రాయడం, ఆయన సీఎం ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేశారు. దీనికి సంబంధించి ఈ మైనింగ్ వ్యవహారంలో మనీ చేతులు మారిందని ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఒక రకంగా జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట లభించిందని చెప్పక తప్పదు.
అక్రమ మైనింగ్ కేసులో తనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హేమంత్ సోరేన్(Jharkhand CM) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీఎం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. మైనింగ్ కుంభకోణం కేసులో హేమంత్ సోరేన్ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్ ) చేపట్టింది.
ఈ సందర్బంగా జార్ఖండ్ సీఎం తన ట్విట్టర్ ఖాతాలో సత్యమే చివరకు గెలుస్తుందని రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021లో సీఎం పదవిలో ఉండగా తనకు మైనింగ్ లీజు మంజూరు చేసినందుకు చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.
ఈడీ జూలైలో దాడులు చేసి మిశ్రా బ్యాంక్ ఖాతాల నుండి రూ. 11.88 కోట్లను స్వాదీనం చేసుకుంది. మిశ్రా సీఎం హేమంత్ సోరేన్ కు సన్నిహితుడిని పేరుంది.
Also Read : పాలకుల వైఫల్యం పేదలకు శాపం