Ashok Chavan Pawar : రాహుల్ యాత్రలో శరద్ పవార్ – చవాన్
ఆరోగ్యం బాగుంటే ఆలోచిస్తారు
Ashok Chavan Pawar : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గత సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ముగిసింది. సోమవారం మహారాష్ట్రలోకి ప్రవేశించింది.
ఈ సందర్బంగా కాంగ్రెస పార్టీ మిత్ర పక్ష పార్టీలైన ఎన్సీపీ, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేలు పాల్గొంటారని ఇప్పటికే సమాచారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్యం కుదట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
దీంతో శరద్ పవార్ రాహుల్ యాత్రలో పాల్గొంటారా లేదా అన్న అనుమానం నెలకొంది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉద్దవ్, పవార్ ను పాల్గొనాలని ఆహ్వానించింది. ప్రస్తుతం పవార్ కు 81 ఏళ్లు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మరాఠా చీఫ్ అశోక్ చవాన్(Ashok Chavan) కీలక వ్యాఖ్యలు చేశారు.
యాత్రలో పాల్గొనా లేదా అనేది పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుందన్నారు. అశోక్ చవాన్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాత్రి మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలోకి ప్రవేశించనుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. ఇదిలా ఉండగా డిశ్చార్జి అయ్యాక షిర్డీకి వెళ్లి పార్టీ సమావేశంలో ప్రసంగించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar).
అయితే నవంబర్ 10న యాత్రలో పాల్గొంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు చవాన్.
Also Read : మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు ఊరట