Vivek Venkata Swamy : కేటీఆర్ ఆరోపణలన్నీ అబద్దాలే – వివేక్
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం ఖాయం
Vivek Venkata Swamy : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఓ గెలుపు కాదన్నారు బీజేపీ సీనీయర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి(Vivek Venkata Swamy). మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాను హవాలా రూపంలో డబ్బులు ఇచ్చినట్లు చేసిన విమర్శలు అర్థ రహితమన్నారు.
మంత్రికి మైండ్ దొబ్బిందన్నారు. జమున హాచరీస్ ప్రత్యేకంగా ప్రస్తావించడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. హైదరాబాద్ కోకా పేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే దానిని హవాలా డబ్బులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో తన చెల్లెలు కల్వకుంట్ల కవితను గెలిపించు కోలేక పోయాడన్నారు. లీడర్ షిప్ క్వాలిటీస్ లేవన్నారు. కేటీఆర్ ఇంఛార్జిగా ఉన్న గట్టుప్పల్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 88 ఓట్లు అధికంగా వచ్చాయమన్నారు.
ఆయనకు సీఎం అయ్యేంత సీన్ లేదన్నారు. తమ పార్టీ తెలంగాణలో విస్తరించిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు వివేక్ వెంకటస్వామి. అవినీతి, అహంకారపూరిత కల్వకుంట్ల పాలన సాగుతోందన్నారు. సీఎంకు సోయి లేకుండా పోయిందన్నారు.
తనకు ఎక్కడి నుంచి కోట్లు వస్తున్నాయో వాటిపై మీ పోలీసులతో దమ్ముంటే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వంత ఆస్తులు పెంచుకోవడంలో ఉన్నంత శ్రద్ద పాలనపై లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలను త్వరలో తేలుస్తామన్నారు. కవిత లిక్కర్ స్కాంపై విచారణ జరగడం ఖాయమన్నారు. ఇక నుంచి మీ ఆటలు సాగవని హెచ్చరించారు.
Also Read : ఓటు ఓడింది నోటు గెలిచింది