Elon Musk Recall : ప్లీజ్ మన్నించండి మళ్లీ రండి – మస్క్
తొలగించిన వారికి ట్విట్టర్ బాస్ పిలుపు
Elon Musk Recall : ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా పేరొందిన టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను భారీ ధరకు కొనుగోలు చేశాక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ. 4,400 కొనుగోలు చేసిన వెంటనే కీలకమైన పోస్టుల్లో ఉన్న సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెతో పాటు వివిధ విభాగాలలో ప్రధానమైన హోదాలలో ఉన్న వారిని తొలగించారు. ఆ వెంటనే ట్విట్టర్ లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించాడు.
మరో వైపు ప్రస్తుతం ట్విట్టర్ లో పని చేస్తున్న 7,500 లలో 3,978 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియ చేశారు. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. ఈ తరుణంలో ఏమైందో ఏమో కానీ తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి రావాలని కోరినట్లు(Elon Musk Recall) సమాచారం. మళ్లీ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు టాక్. తొలగించిన వారిలో సగానికి పైగా మళ్లీ పిలవాలని నిర్ణయించారు.
తొలగించిన వారికి సంబంధించిన జాబితాలో కొన్ని పొరపాట్లు జరిగాయని దీనికి మన్నించాలని , మీరంతా తిరిగి ట్విట్టర్ విధుల్లో చేరాలని ఎలాన్ మస్క్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్విట్టర్ బాస్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా మస్క్ ఆకస్మిక నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందానికి లోనయ్యారు.
Also Read : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్