CJI UU Lalit : సెల‌వు తీసుకుంటున్నా సంతృప్తితో వెళుతున్నా

వీడ్కోలు స‌భ‌లో కాబోయే సీజేఐకి కంగ్రాట్స్

CJI UU Lalit : నా జీవితంలో నేను ఏనాడూ అనుకోలేదు అత్యున్న‌త‌మైన భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు సీజేఐగా అవుతాన‌ని. ఈ జీవిత ప్ర‌యాణంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. మ‌రిచి పోలేని జ్ఞాప‌కాలు ఉన్నాయి.

ప‌ని చేసింది కొద్ది కాల‌మే అయినా చాలా సంతృప్తిక‌రంగా నా వృత్తికి, ప‌ద‌వికి న్యాయం చేశాన‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యూయూ ల‌లిత్(CJI UU Lalit). సోమవారం సీజేఐగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జ‌స్టిస్ యూయూ ల‌లిత్ భావోద్వేగానికి లోన‌య్యారు. ఏడాది పొడ‌వునా ఒకే రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ప‌ని చేసేలా ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చీఫ్ జ‌స్టిస్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో చెప్పాన‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.

రాజ్యాంగ ద‌ర్మాస‌నంలో భాగం కావ‌డానికి ప్ర‌తి ఎస్సీ న్యాయ‌మూర్తికి స‌మాన అవ‌కాశం ఉండాల‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ యూయూ ల‌లిత్. చివ‌రిసారిగా సుప్రీంకోర్టు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు సంతృప్తితో పాటు సాఫ‌ల్య భావ‌న‌తో బ‌య‌లు దేరుతున్నాన‌ని అన్నారు.

నేను ఇక్క‌డ 37 సంవ‌త్స‌రాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ రెండు రాజ్యాంగ బెంచ్ లు ఒకేసారి కూర్చోవ‌డం ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పారు. కానీ నా హ‌యాంలో ఒకే నిర్దిష్ట‌మైన రోజు మూడు రాజ్యాంగ బెంచ్ లు ఒకేసారి పిటిష‌న్ల‌ను విచారించాయ‌ని స్ప‌ష్టం చేశారు సీజేఐ జ‌స్టిస్ యూయూ ల‌లిత్(CJI UU Lalit).

ఈ కోర్టులో నా ప్ర‌యాణం కోర్ట్ 1లో ప్రారంభ‌మైంది. నేను సీజేఐ వైవీ చంద్ర‌చూడ్ ముందు హాజ‌ర‌వుతున్న ఒక కేసు గురించి ప్ర‌స్తావించేందుకు ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు. ఇక నా చేతిలో ఉన్న లాఠీని చంద్ర‌చూడ్ కు అప్ప‌గిస్తున్నాన‌ని చెప్పారు జ‌స్టిస్ ల‌లిత్.

Also Read : సుప్రీం తీర్పులో కుల‌తత్వం – ఉదిత్ రాజ్

Leave A Reply

Your Email Id will not be published!