Justice DY Chandrachud : దేశం చూపు ‘చంద్రచూడ్’ వైపు
50వ సీజేఐగా కొలువు తీరనున్నారు
Justice DY Chandrachud : సంచలన తీర్పులకే కాదు ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలకు పెట్టింది పేరు జస్టిస్ డీవై చంద్రచూడ్. 49వ సీజేఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50వ సీజేఐగా కొలువు తీరనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud).
ఆయనపై దాఖలైన పిటిషన్ ను కొట్టి వేసింది సుప్రీం ధర్మాసనం. ఇది పక్కన పెడితే చంద్రచూడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధునిక భావాలే కాదు నిబద్దత కలిగిన న్యాయవాదిగా గుర్తింపు పొందారు. దేశాన్ని ప్రభావితం చేసిన ఎన్నో కేసులపై తీర్పు చెప్పారు. ఆయన వెలువరించిన తీర్పులు, చేసిన వ్యాఖ్యానాలు కోట్స్ గా చాలా మంది ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారు.
ఇదీ ఆయనకు ఉన్న ప్రత్యేకత. తన తదుపరి వారసుడిగా యూయూ లలిత్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ను ప్రతిపాదించారు. మరో వైపు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) మాత్రం ప్రస్తుతం కొలీజియం వ్యవస్థపై అసంతృప్తితో ఉన్నారు. కేవలం న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సీజేఐని ఎలా ఎంపిక చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ నెలలోనే సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రచూడ్. ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు ఉంటారు. నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ 74 రోజుల తక్కువ పదవీ కాలం తర్వాత నవంబర్ 8న తప్పుకుంటారు.
మొత్తంగా విలక్షణ తీర్పులు ఇచ్చే జస్టిస్ చంద్రచూడ్ పట్ల సామాన్యులు, దేశ ప్రజానీకం ఎంతో నమ్మకం పెట్టుకుంది. మరి ఆయన తనదైన ముద్ర కనబరుస్తారా అన్నది చూడాలి.
Also Read : సెలవు తీసుకుంటున్నా సంతృప్తితో వెళుతున్నా