Palvai Sravanthi Reddy : కోమటిరెడ్డి ఓ కోవర్ట్ – స్రవంతి రెడ్డి
కాంగ్రెస్ ఎంపీపై షాకింగ్ కామెంట్స్
Palvai Sravanthi Reddy : మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా ఇంకా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా సిట్టింగ్ సీటును కోల్పోవడంతో పాటు కనీసం డిపాజిట్ కూడా రాక పోవడంపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో జంప్ అయ్యారు.
తాను గెలుస్తానన్న నమ్మకంతో రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. ఊహించని రీతిలో టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. కమలాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ తరుణంలో దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి తనయ పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది.
కానీ పార్టీ సీనియర్ల నుంచి సరైన సహకారం లభించ లేదన్న ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసింది పాల్వాయి స్రవంతి రెడ్డి(Palvai Sravanthi Reddy). ఓటమి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ అర్ధ, అంగ బలంతో ప్రజాస్వామ్యానికి పాతర వేశాయంటూ ఆరోపించారు.
రెండు ప్రధాన పార్టీలు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. కేవలం డబ్బులు పెట్టి ఓట్లను కొనేందుకు ఈ ఉప ఎన్నిక కావాలని తీసుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు స్రవంతి రెడ్డి. ఇక తమ పార్టీ విషయానికి వస్తే కోవర్టు రాజకీయాలే కొంప ముంచాయంటూ ఆరోపించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం పార్టీని డ్యామేజ్ చేసిందంటూ మండిపడ్డారు స్రవంతి రెడ్డి. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు తీసుకు వెళ్లానని చెప్పారు. ఇంతటి అనైతిక రాజకీయాలు తాను చూడలేదన్నారు.
Also Read : ఖాళీల భర్తీ ఆలస్యం గవర్నర్ గరం