CJI Justice UU Lalit : ఒక రోజు ముందే సీజేఐ పదవీ విరమణ
సంతృప్తిగా సాగిందన్న యుయు లలిత్
CJI Justice UU Lalit : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో అత్యున్నత పదవిలో కొలువు తీరిన 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్(CJI Justice UU Lalit) ఒక రోజు ముందుగానే పదవీ విరమణ పొందారు. నవంబర్ 8న రిటైర్మెంట్ కావాల్సి ఉండగా మంగళవారం గురు పూర్ణిమ కావడం, కేంద్ర సర్కార్ సెలవు ప్రకటించడంతో 7న సోమవారం ఒక రోజు ముందుగానే తప్పుకున్నారు. ఇదిలా ఉండగా సీజేఐ తక్కువ కాలం మాత్రమే పని చేశారు. కీలకమైన ముద్ర వేశారు.
విచిత్రం ఏమిటంటే జస్టిస్ లలిత్ 1957 నవంబర్ 9న పుట్టారు. 1983 జూన్ లో అడ్వొకేట్ గా నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబర్ వరకు మహారాష్ట్ర లోని బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1986 జనవరిలో ముంబై నుంచి ఢిల్లీ కోర్టుకు వచ్చారు. 2004లో ఏప్రిల్ లో సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వొకేట్ హోదా లభించింది. 2014 ఆగస్టు 3న బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా నియమితులయ్యారు జస్టిస్ యుయు లలిత్.
గురు నానక్ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడంతో ముందుగానే లలిత్ కు వీడ్కోలు పలికారు.
ఇదిలా ఉండగా 49వ సీజేఐగా ఆగస్టు 27న ప్రమాణం చేశారు. మొత్తం 74 రోజుల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో ఉన్నారు. ఇక పదవీ విరమణ పొందిన జస్టిస్ యుయు లలిత్ స్థానంలో కీలకమైన న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐగా కొలువు తీరనున్నారు.
నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన రెండు సంవత్సరాల పాటు సీజేఐగా కొనసాగుతారు. డీవై చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకు కొనసాగుతారు.
Also Read : దేశం చూపు ‘చంద్రచూడ్’ వైపు