Papikondalu Tour : పాపికొండ‌ల్లో పారా హుషార్

ప‌ర్యాట‌కానికి స‌ర్కార్ ప‌చ్చ జెండా

Papikondalu Tour : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌ర్యాట‌కుల‌కు తీపి క‌బురు చెప్పింది. కొంత కాలంగా నిలిపి వేసిన పాపికొండ‌ల టూర్ ను తిరిగి పున‌రుద్ద‌రించింది. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌స్తుతానికి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంతం అయ్యింది. భ‌ద్రాచలంలో ఇందుకు సంబంధించి టికెట్ల విక్ర‌యానికి ఓకే చెప్పింది.

దీంతో పెద్ద‌ల‌కు ఒక్కొక్క‌రికి రూ. 950 , పిల్ల‌లు ఒక్కొక్క‌రికి రూ. 750 గా టికెట్ ధ‌ర‌ల‌ను నిర‌యించింది ఏపీ ప్ర‌భుత్వం. పాపికొండ‌ల‌ను చూడాల‌ని, ప‌ర్య‌టించాల‌ని అనుకునే వారు న‌వంబ‌ర్ 9వ తేదీ నుంచి గోదావ‌రి లాంచీల్లో పాపికొండ‌ల‌ను(Papikondalu Tour) తిల‌కించేందుకు ఏపీ స‌ర్కార్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

ఇందుకు సంబంధించి ప‌ర్యాట‌ల‌కు సూచ‌న‌లు కూడా చేసింది. ఈ టికెట్ల‌ను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల భ‌ద్రాచ‌లంలో శ్రీ సీతారామ‌చంద్ర స్వామిని ద‌ర్శించుకున్న త‌ర్వాత టూరిస్టులు పాపికొండ‌ల యాత్ర‌కు వెళ్లేందుకు టికెట్ కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం.

ఏపీ రాష్ట్రంలోని వీఆర్ పురం మండ‌లానికి చెందిన ఉన్న‌తాధికారులు లాంచీల య‌జ‌మానుల‌తో క‌లిసి ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. ఇది పూర్తిగా స‌క్సెస్ కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోచ‌వ‌రం నుంచి పాపికొండ‌లు దాట‌డం, అక్క‌డి నుంచి తెల్ల దిబ్బ‌లు, కొర్టూరు వ‌ర‌కు లాంచీలో వెళ్లి వాతావ‌ర‌ణాన్ని ప‌రిశీలించారు.

అంతా బాగుందంటూ నివేదిక ఇవ్వ‌డంతో బుధ‌వారం నుంచి పాపికొండ‌ల యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఇందులో 17 లాంచీల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. సో..ప‌ర్యాట‌కుల‌కు ఖుష్ క‌బ‌ర్ అన్న‌మాట‌.

టూర్ కు సంబంధించి పోచ‌వ‌రం నుంచి లాంచీ బ‌య‌లు దేరుతుంది. పాపికొండ‌ల్లోని కొర్టూరు దాకా వెళ్లి తిరిగి వ‌స్తుంది.

Also Read : ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ గా కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!