TS High Court : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత
విచారణకు ఖాకీలకు లైన్ క్లియర్
TS High Court : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. ఇందుకు సంబంధించి పోలీసుల దర్యాప్తుపై గతంలో తాత్కాలికంగా స్టే విధించింది కోర్టు(TS High Court) . దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది మంగళవారం.
ఇందుకు సంబంధించి ఫాం హౌస్ లో చోటు చేసుకున్న ఈ గలీజు తతంగంపై పూర్తిగా విచారించింది ధర్మాసనం. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫక్తు రాజకీయ కారణాలతోనే కేసులు విచారణకు వస్తున్నాయని ఇది మంచి పద్దతి కాదని మండిపడింది.
అంతే కాదు మీ రాజకీయాలకు కోర్టులను కేరాఫ్ గా వాడుకోవాలని అనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నిరభ్యంతరంగా ఎప్పుడైనా కేసును దర్యాప్తు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ వేసిన రిట్ పిటిషన్ ను విచారించిన కోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్దన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మరో ఎమ్మెల్యే రేగా కాంతా రావులను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Also Read : మోదీ నిర్వాకం వల్లే దేశం నాశనం – కేటీఆర్