CJI DY Chandrachud : 50వ సీజేఐగా జ‌స్టిస్ డివై చంద్ర‌చూడ్

నేడు ప్ర‌మాణ స్వీకార కార్యక్ర‌మం

CJI DY Chandrachud : భార‌త దేశ స‌ర్వోత‌న్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ కొలువు తీర‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీజేఐగా ఉన్న జ‌స్టిస్ యుయు ల‌లిత్ న‌వంబ‌ర్ 7న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

గురు నాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సెల‌వు రోజు కావ‌డంతో ఒక రోజు ముందుగానే రిటైర్ అయ్యారు జ‌స్టిస్ యుయు ల‌లిత్. ఇక ఆయ‌న స్థానంలో 50వ ప్ర‌ధాన న్యాయూమ‌ర్తిగా డీవై చంద్ర‌చూడ్(CJI DY Chandrachud) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ఆయ‌న న‌వంబ‌ర్ 10, 2024 వ‌ర‌కు రెండు ఏళ్ల పాటు సీజేఐగా వ్య‌వ‌హ‌రిస్తారు. అక్టోబ‌ర్ 11న త‌న త‌దుప‌రి వార‌సుడిగా సీజేఐ యుయు ల‌లిత్ ప్ర‌క‌టించారు. డీవై చంద్ర‌చూడ్ పూర్తి పేరు ధ‌నంజ‌య వై చంద్ర చూడ్. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.

డీవై చంద్ర‌చూడ్ తండ్రి వైవీ చంద్ర‌చూడ్ భార‌త దేశానికి ప్ర‌ధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం ప‌ని చేశారు. ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 22, 1978 నండి జూలై 11, 1985 వ‌ర‌కు సీజేఐగా ఉన్నారు.

ఇక జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్(CJI DY Chandrachud) న‌వంబ‌ర్ 11, 1959న పుట్టారు. మే 13, 2016న ఉన్న‌త న్యాయ‌స్థానానికి ప‌ద‌న్నోతి పొందారు. అయోధ్య భూ వివాదం, గోప్య‌త హ‌క్కు, వ్య‌భిచారానికి సంబంధించిన విష‌యాల‌తో స‌హా అనేక రాజ్యాంగ బెంచ్ లు, అత్యున్న‌త న్యాయస్థానం కీల‌క తీర్పుల‌లో ఆయ‌న భాగ‌మ‌య్యారు.

ఐపీసీ లోని సెక్ష‌న్ 377 , ఆధార్ ప‌థ‌కం చెల్లుబాటు, శ‌బ‌రిమ‌ల స‌మ‌స్య‌ను పాక్షికంగా కొట్టి వేసిన త‌ర్వాత స్వ‌లింగ సంబంధాల‌ను నేర‌రహితం చేయ‌డంపై సంచ‌ల‌నాత్మ‌క తీర్పుల‌ను వెలువ‌రించిన ధ‌ర్మాస‌నాల్లో జ‌స్టిస్ చంద్రచూడ్ ఒక‌రు. క‌రోనాను జాతీయ సంక్షోభ‌మంటూ తీర్పు చెప్పారు.

Also Read : 12న సుప్రీం తీర్పుపై అఖిల‌పక్ష స‌మావేశం – స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!