Meta FB Layoff : ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
నిరుత్సాహకర వృద్ది..రాబడి తగ్గుదల
Meta FB Layoff : నిన్న ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న ట్విట్టర్ లో ఉద్యోగాలకు ఎసరు పెడితే తాజాగా అదే బాటలో మార్క్ జుకర్ బర్గ్ సారథ్యంలోని ఫేస్ బుక్ – మెటా లో పెద్ద ఎత్తున ఎంప్లాయిస్ ను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా సోషల్ మీడియా దిగ్గజాలకు కోలుకోలేని షాక్.
ఇప్పటికే గత సెప్టెంబర్ నెలాఖరులో హెచ్చరికలు కూడా జారీ చేశాడు. మెటా ఖర్చులను తగ్గించేందుకు , టీంలను పునరుద్దరించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు జుకర్ బర్గ్(Mark Zuckerberg). ఇదిలా ఉండగా ఫేస్ బుక్ కు మెటా అనుచర కంపెనీగా చేశాడు.
ముందుగా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ఇది ఒక రకంగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియకు మూలంగా మారింది. ఉద్యోగాల కోతకు సంబంధించి స్పందించ లేదు మెటా. గత కొంత కాలంగా నిరుత్సాహకర ఆదాయాలు, రాబడి తగ్గుదల కారణంగా ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తోంది(Meta FB Layoff).
బుధవారం నుండి ఉద్యోగాలలో కోత విధించాలని నిర్ణయించారు మార్క్ జుకర్ బర్గ్. ఎంప్లాయిస్ తీసివేతకు సంబంధించి ఫేస్ బుక్ – మెటా సిఇఓ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెయిల్స్ ద్వారా పంపించారు.
మెరుగైన ఫలితాలు రాక పోవడానికి ఒక రకంగా తాను కూడా కారణమని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ముందస్తు వ్యూహంలో భాగంగా వచ్చే ఏడాది 2023లో కొత్త జాబ్స్ అంటూ ఉండవని కుండబద్దలు కొట్టారు మార్క్ జుకర్ బర్గ్.
Also Read : ట్విట్టర్ లో కీలక మార్పు – ఎస్తేర్ క్రాఫోర్డ్