Nepal Delhi Earthquake : నేపాల్..ఢిల్లీ.. గురుగ్రామ్ లో భూకంపం
6.3 తీవ్రతతో కంపించిన భూమి
Nepal Delhi Earthquake : నేపాల్ సరిహద్దు వెంట ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ సమీపంలో బుధవారం భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో తాకిడికి కొద్ది గంటల్లోనే ఉత్తర భారతం అంతటా బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ – ఎన్సీఆర్ లో దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు నెలకొన్నాయి.
ఉత్తరా ఖండ్ లోని పితోర్ ఘర్ కు తూర్పు ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో నేపాల్ భూకంప కేంద్రం ఉందని ఇవాళ తెల్లవారుజామున 1.57 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్)(Nepal Delhi Earthquake) తెలిపింది. ఢిల్లీ,ఘజియాబాద్, గురుగ్రామ్ పరిసర ప్రాంతాలతో పాటు లక్నోలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కానీ ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. నిద్రలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ లోని హిమాలయ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నేపాల్ లో గత రెండు రోజులుగా తక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి మీనాకాశీఈ లేఖి సూచించారు. ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేశారు ప్రజలకు. నేపాల్ లోని దిపాయల్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప(Nepal Delhi Earthquake) కేంద్రం ఉన్నట్లు యుఎస్జీ తెలిపింది.
ఈ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4.9 తీవ్రతతో ఒకసారి మరోసారి 3.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయని ఎన్సీఎస్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఉత్తర కాశీకి తూర్పు ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం కారణంగా ఆదివారం ఉత్తరాఖండ్ లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Also Read : జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు