Esther Crawford : ట్విట్ట‌ర్ లో కీల‌క మార్పు – ఎస్తేర్ క్రాఫోర్డ్

కొత్త‌గా అధికారిక ధృవీక‌ర‌ణ బ్యాడ్జ్

Esther Crawford : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే 3,978 మందిని ఇంటికి సాగ‌నంపిన కొత్త బాస్ ఇక నుంచి ప్ర‌తి నెలా బ్లూ టిక్ కోసం రుసుము వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇందు కోసం ఎవ‌రైనా స‌రే బ్లూ టిక్ కావాలంటే ప్ర‌తి నెలా $8 డాల‌ర్లు చెల్లించాల‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశాడు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు ఎలాన్ మ‌స్క్. ఇక నుంచి ధృవీక‌రించిన ఖాతాల కోసం ట్విట్ట‌ర్ కొత్తగా అధికారిక ధ్ర‌వీక‌ర‌ణ బ్యాడ్జ్ ను ప్రారంభించ‌నుంద‌ని తెలిపారు.

ఇంత‌కు ముందు ధృవీక‌రించిన అన్ని అకౌంట్లు అధికారిక లేబుల్ ను పొంద‌వు. లేబుల్ కొనుగోలుకు అందుబాటులో లేద‌ని ట్విట్ట‌ర్ ప్రొడ‌క్ట్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్(Esther Crawford) వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఖాతాలు, వాణిజ్య, వ్యాపార సంస్థ‌లు, ఇత‌ర భాగ‌స్వాములు, ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు , ప్ర‌చుర‌ణ క‌ర్త‌లు , కొంత‌మంది ప‌బ్లిక్ వ్య‌క్తులు, సెల‌బ్రిటీలు, క్రీడాకారులు ఇందులో ఉన్నార‌ని క్రాఫోర్డ్ ట్వీట్ చేశారు

ఇదిలా ఉండ‌గా కొత్త‌గా మార్పు చేసిన ట్విట్ట‌ర్ బ్లూలో ఐడీ ధృవీక‌ర‌ణ లేదు. ఇది ఎంపిక‌, చెల్లింపు స‌భ్య‌త్వం, బ్లూ చెక్ మార్క్, ఎంచుకున్న ఫీచ‌ర్ల‌కు సంబంధించి యాక్సెస్ అందిస్తుంది. ఖాతా ర‌కాల మ‌ధ్య తేడాను గుర్తించేందుకు ఇది కూడా దోహ‌ద ప‌డుతుంద‌ని ఆమె వెల్ల‌డించారు.

ఇక తీసి వేసిన ఉద్యోగుల‌లో కొంత మందిని తిరిగి రావాల్సిందిగా ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ కోరారు. ఇందులో భాగంగా ప్ర‌త్యేకించి కీల‌క భాగాల‌లో ఉన్న వారు ఉన్న‌ట్లు టాక్.

Also Read : ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత

Leave A Reply

Your Email Id will not be published!