CJI DY Chandrachud : ఇక మాట‌లుండ‌వు చేతలు మాత్ర‌మే

సీజేఐ డైవై చంద్ర‌చూడ్ కామెంట్స్

CJI DY Chandrachud :  భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బుధ‌వారం కొలువు తీరారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ఆయ‌న కార్య‌రంగంలోకి దూకారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరొందారు. సుదీర్ఘ కాలం పాటు తండ్రి వైవీ చంద్ర‌చూడ్(CJI DY Chandrachud) ఈ దేశానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు.

అనంత‌రం త‌న‌యుడిగా డీవై చంద్ర‌చూడ్ త‌న‌దైన ముద్ర‌ను వేశారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్నారు. జాతీయ మీడియాతో సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ మాట్లాడారు.

తాను ఏమిటో, తాను ఏం చేయాల‌ని అనుకున్నాడో కుండ బ‌ద్ద‌లు కొట్టారు. తాను ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట ప‌డ‌న‌ని, కానీ నా చేత‌లే అంటే ఇచ్చే తీర్పులే మాట్లాడేలా చేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ చంద్రచూడ్.

ఇదిలా ఉండ‌గా దేశంలోని ప్ర‌ధాన కేసుల‌కు సంబంధించిన వెలువ‌రించిన తీర్పుల‌లో ఆయ‌న కీల‌కంగా ఉన్నారు. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ కొటేష‌న్లుగా వాడుకుంటున్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

సాధార‌ణ పౌరుడికి సేవ చేయ‌డం త‌న ప్రాధాన్య‌త అని చెప్పారు. రిజిస్ట్రీ, న్యాయ ప్ర‌క్రియ‌ల‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు హామీ ఇచ్చారు. నా చ‌ర్య‌లు మాట‌లు కాదు మాట్లాడుకునేలా చేస్తాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్(CJI DY Chandrachud).

అయోధ్య భూ వివాదం, గోప్య‌త హ‌క్కు స‌హా అనేక రాజ్యాంగ ధ‌ర్మాస‌నాలు, మైలు తీర్పుల‌లో ఆయ‌న కీల‌కంగా ఉన్నారు.

Also Read : మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా అరుణా మిల్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!