Revanth Reddy : మడమ తిప్పం కేసీఆర్ పై యుద్దం ఆపం
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దేశంలో బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ప్లాన్ తోనే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
మునుగోడులో తమ ఓటమికి కారణం ఎవరో ప్రజలకు తెలుసని తాను ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వేధింపులకు గురి చేసినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో విద్వేషాలతో రగిలి పోతున్న దేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకు వచ్చేందుకు నడుం బిగించిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.
వేలాది మంది స్వచ్ఛంధంగా పాదయాత్రలో పాల్గొన్నారని, ఊహించిన దాని కంటే ఎక్కువగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయం సాధించిందని చెప్పారు.
కమ్యూనిస్టులతో కలిసినందుకే టీఆర్ఎస్ గెలుపొందిందన్నారు. 86 మంది ఎమ్మెల్యేలు, 18 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, అధికార యంత్రాంగం, నోట్ల కట్టలు, కేసులు, వేధింపులు, బెదిరింపులు ఇలాంటి చౌకబారు ప్రలోభాలకు గురి చేయడం వల్లనే టీఆర్ఎస్ గెలుపొందిందన్నారు.
న్యాయ బద్దంగా జరిగి ఉంటే తామే గెలిచి ఉండేవారమన్నారు. ఒకరు బలుపుతో బరిలోకి దిగారని మరొకరు తమ అధికార మదాన్ని ప్రదర్శించారని ఇద్దరూ ఇద్దరూ నైతికంగా ఓడి పోయారని అన్నారు. ఇక దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు.
ఆ సంస్థలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు.
Also Read : రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదు