ED Arrests : ఢిల్లీ మద్యం స్కామ్ లో ఇద్దరు అరెస్ట్
అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్, బాబు
ED Arrests : కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ మద్యం స్కామ్ లో దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దర్యాప్తునకు ఆదేశించడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికే వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
మొదటగా ఈడీ ఢిల్లీ ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ సోదాలు చేపట్టింది. ఆయనకు చెందిన మొబైల్ ఫోన్ , ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఆ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా 40 చోట్ల లిక్కం స్కాంకు సంబంధించి సోదాలు చేపట్టింది ఈడీ, ఐటీ.
ఇందులో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని తేల్చింది. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది. తాజాగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది ఈడీ(ED Arrests).
ప్రముఖ ఫార్మా కంపెనీగా పేరొందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేశారు. వినయ్ బాబు ఫెర్నాడ్ రికార్డ్ ఆన్ లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత రెండు కొన్ని రోజుల నుంచి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇంకొన్ని రోజుల్లో ఎంత మంది అరెస్ట్ అవుతారనేది గుబులు రేపుతోంది. ఇదిలా ఉండగా స్కామ్ కు సంబంధించి రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ , ముంబైకి చెందిన విజయ్ నాయర్ , ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.
Also Read : బీజేపీకి అంత సీన్ లేదు – దీదీ