CJI Chandrachud : న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు – సీజేఐ
సామాన్యులకు అండగా ఉంటా
CJI Chandrachud : ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణ ప్రదమైన న్యాయ వ్యవస్థకు కీలకమైన ప్రధాన న్యాయమూర్తి పోస్టులో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు సీజేఐ డీవై చంద్రచూడ్. దేశ చరిత్రలో తన తండ్రి సుదీర్ఘ కాలం పాటు సీజీఐగా విధులు నిర్వహించారు.
కీలకమైన తీర్పులు చెప్పారు. డీవై చంద్రచూడ్ సైతం తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు. సంచలన తీర్పులు, కీలకమైన వ్యాఖ్యలు, విలక్షణమైన వ్యక్తిత్వంతో తనదైన ముద్ర కనబరుస్తూ వచ్చారు జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud). ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక నుండి మాటలు ఉండవని, కేవలం చేతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఒక రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభత్వంలో భాగమైన న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు కొలీజియం వ్యవస్థపై అసంతృప్తితో ఉన్నారు.
ఆయన పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఎవరికీ లొంగని న్యాయమూర్తిగా ఇప్పటికే పేరు పొందారు జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. తన ముందున్న కర్తవ్యం, లక్ష్యం ఒక్కటే..సామన్యులకు సేవ చేయడమే తన ప్రయారిటీ అని స్పష్టం చేశారు.
టక్నాలజీలో, రిజిస్ట్రీలో లేదా జ్యుడీషియల్ లో కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీజేఐ. దేశ ప్రజలందరికీ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా తన తండ్రి 7 ఏళ్ల పాటు భారత దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పని చేయడం విశేషం. తనయుడు సీజేఐగా ఉండడం చరిత్రాత్మకం.
Also Read : ఇక మాటలుండవు చేతలు మాత్రమే