Gujarat BJP Leaders : గుజరాత్ బీజేపీలో సీనియర్లకు నో ఛాన్స్
విజయ్ రూపాని, నితిన్ పటేల్ దూరం
Gujarat BJP Leaders : గుజరాత్ లో ఎన్నికల నగారా మోగింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత వేడెక్కింది. ఇప్పటికే 27 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఈసారి ఎన్నికల్లో సీనియర్లకు టికెట్లు ఇవ్వడం లేదు.
ఇప్పటికే అగ్ర నేతలు తాము పోటీ చేయబోమంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బీజేపీలో(Gujarat BJP Leaders) అగ్ర నాయకులు విజయ్ రూపానీ, నితిన్ పటేల్ పోటీ చేయడం లేదు. విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు సీఎంగా ఉన్నారు. 2021 సెప్టెంబర్ లో పూర్తి కేబినెట్ పై ఫోకస్ పెట్టారు.
రూపానీతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ , అధికార బీజేపీ సీనియర్ నేతలు వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ ప్రకటించారు. ఇదే సమయంలో రూపానీ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న మరో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతలు భూపేంద్ర సింగ్ చూడసమా , ప్రదీప్ సిన్హ్ జడేజా కూడా టికెట్లు కోరడం లేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర పార్లమెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఈ ప్రకటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్ బీజేపీ(Gujarat BJP Leaders) అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ ఈ మేరకు నలుగురు సీనియర్ నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు.
Also Read : ఢిల్లీ మద్యం స్కామ్ లో ఇద్దరు అరెస్ట్