Gujarat BJP List : 160 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
హార్దిక్ పటేల్..రివబా జడేజాకు ఛాన్స్
Gujarat BJP List : గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొదటి జాబితాను 160 మందితో విడుదల(Gujarat BJP List) చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన హార్దిక్ పటేల్ తో పాటు ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబా జడేజాకు టికెట్లను కేటాయించింది.
ఇక మాజీ సీఎం రూపానీ, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు సీనియర్లకు షాక్ ఇచ్చింది. వారిని పార్టీకి దూరంగా పెట్టింది. మరో వైపు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించి 141 మందిని పొట్టన పెట్టుకున్న మోర్బీ వంతెన కూలిన ఘటనలో ప్రాణాలకు తెగించి కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు మోర్బీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది.
ఇక అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ ఇచ్చింది. పోటీ నుంచి తప్పించింది. విడుదల చేసిన లిస్టులో(Gujarat BJP List) మొత్తం 160 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 22 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక తాజాగా ప్రకటించిన లిస్టులో 14 మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు 13 సీట్లు కేటాయించింది. ఇతరులు 24 మందిని కేటాయించింది. ఈ జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.
ఇక ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్ ను బరిలోకి దింపింది. అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది పార్టీ.
Also Read : హార్దిక్ పటేల్..జడేజా భార్యకు బీజేపీ టికెట్