Gyanvapi Case : 11న జ్ఞానవాపి కేసుపై సుప్రీం తుది తీర్పు
కీలక దశకు చేరుకున్న మసీదు, మందిర్ వివాదం
Gyanvapi Case : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన యూపీ లోని జ్ఞాన వాపి కేసుకు(Gyanvapi Case) సంబంధించి తుది తీర్పు నవంబర్ 11 శుక్రవారం వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసుకు సంబంధించి సీల్ ఆర్డర్ ముగించేందుకు ఒక రోజు ముందు సుప్రంకోర్టు విచారణ చేపట్టనుంది.
మసీదు సముదాయంలో శివలింగం కనిపించిందని హిందూ పిటినర్ల బృందం ఆరోపించింది. గత మే నెలలో ఆ ప్రాంతాన్ని సీలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మసీదు దేశంలో పేరొందిన ప్రముఖ ఆలయం కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉంది.
శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీలు చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉండక పోవడానికి ఒక రోజు ముందు మసీదు కేసును కోర్టు శుక్రవారం విచారించనుంది. ఇప్పటికే వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పలు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు కోర్టు ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా ఆలయానికి, మసీదుకు సంబంధించిన కాంప్లెక్స్ లోపల ఒక ప్రాంతం ఇప్పుడు హిందూ భక్తులకు ప్రార్థనల కోసం సంవత్సరానికి ఒకసారి తెరవబడుతుంది.
ఐదుగురు మహిళా పిటిషనర్లు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. తాము ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అక్కడ శివలింగం లేనే లేదంటున్నారు ముస్లిం వర్గాలు. మొత్తంగా రేపటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అంతకు ముందు వారణాసి కోర్టు మసీదు సముదాయాన్ని వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే సమయంలో శివలింగం ఉన్నట్టు కనుగొన్నారని హిందూ పక్షం తెలిపింది.
Also Read : న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు – సీజేఐ