Palanivel Thiagarajan : గవర్నర్ కు పని తక్కువ పాలిటిక్స్ ఎక్కువ
ఎన్నిక కాకుండా అయితే ఎలా
Palanivel Thiagarajan : బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు తమిళనాడు ఆర్థిక మంత్రి పి. త్యాగరాజన్. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, జార్ఖండ్ , ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్, పంజాబ్ , ఢిల్లీలో ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గురువారం పి. త్యాగరాజన్ సీరియస్ గా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరుగా ఎన్నికైతే పాలనకు సంబంధించిన ఇబ్బందులు ఏమిటో తెలుస్తుందన్నారు. కానీ కేంద్రం నుంచి ఎంపికైనా లేదా నియమించబడిన వారికి పాలనా పరంగా అనుభవం అంతగా ఉండదన్నారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు పి. త్యాగరాజన్(Palanivel Thiagarajan). కేరళలో సీఎం విజయన్ ను కావాలని అక్కడి గవర్నర్ ఖాన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక్కడ తమ రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 కి పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మండిపడ్డారు.
రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ రవి పూర్తిగా ఏకపక్షంగా, కేంద్రానికి ఊడిగం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. అందుకే గవర్నర్ వద్దంటూ తాము అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ బద్దంగా గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
తాము దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు పి. త్యాగరాజన్. ప్రస్తుతం త్యాగరాజన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వాళ్లు పూర్తిగా గవర్నర్ పదవులకు కళంకితులుగా మారారని సంచలన ఆరోపణలు చేశారు పి. త్యాగరాజన్(Palanivel Thiagarajan).
తాజాగా త్యాగరాజన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : వీర్ దాస్ స్టాండప్ షో రద్దు