Elon Musk : ఎవ‌రైనా ఆఫీసుకు రావాల్సిందే – మ‌స్క్

ట్విట్ట‌ర్ ఉద్యోగులకు కోలుకోలేని షాక్

Elon Musk : టెస్లా సిఇఓ , ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ మేర‌కు ఇప్ప‌టికే 3,978 మంది ఉద్యోగుల‌కు చెక్ పెట్టాడు. ఆపై కొంత మందికి మాత్ర‌మే ప‌ని చేసేందుకు అవ‌కాశం ఇచ్చాడు. ఇప్ప‌టికే టాప్ పొజిష‌న్ లో ఉన్న వారంద‌రిని సాగ‌నంపాడు.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించాడ‌నే నెపంతో సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ ను త‌ప్పించాడు. ఆపై ఆయ‌న‌కు స‌పోర్ట్ గా ఉన్న లీగ‌ల్ హెడ్ విజ‌యా గ‌ద్దెను తొల‌గించాడు. మ‌రో వైపు ఇమెయిల్స్ ద్వారా ఎవ‌రూ రావ‌ద్దంటూ స‌మాచారం పంపాడు. అంత వ‌ర‌కు ట్విట్ట‌ర్ ఆఫీసుల‌ను మూసి వేస్తున్న‌ట్లు తెలిపాడు.

ఈ త‌రుణంలో మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్ర‌తి నెలా నెలా $8 డాల‌ర్ల రుసుము చెల్లించాల‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌ధానంగా బ్లూ టిక్ ఉన్న వారికి ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నాడు. వారికి ట్విట్ట‌ర్ ప‌రంగా ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపాడు. ఈ త‌రుణంలో గురువారం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

ఇమెయిల్ ద్వారా ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అదేమిటంటే ఇక నుంచి ఇంటి వ‌ద్ద నుండి ప‌ని చేస్తానంటే ఒప్పుకోనంటూ ప్ర‌క‌టించాడు. ఎవ‌రైనా స‌రే ట్విట్ట‌ర్ ఆఫీసుకు రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశాడు ఎలాన్ మ‌స్క్(Elon Musk). ఈ మొత్తం స‌మాచారాన్ని ఇమెయిల్ ద్వారా వెల్లడించాడు.

రిమోట్ ప‌నిని ఒప్పుకోన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. ఉద్యోగులు వారానికి క‌నీసం 40 గంట‌లు కార్యాల‌యంలో ఉండాల‌ని ఆదేశించాడు ట్విట్ట‌ర్ బాస్. మిన‌హాయింపుల‌కు లోబ‌డి తాను ఆమోదిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : $4 బిలియ‌న్ల టెస్లా షేర్ల విక్ర‌యం

Leave A Reply

Your Email Id will not be published!