Jaish Terrorist Killed : షోపియాన్ లో జైషే ఉగ్రవాది హతం
జల్లెడ పడుతున్న భారత దళాలు
Jaish Terrorist Killed : జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ లో జైషే ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ లోని కప్రెన్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్ లో ఖతమైన వ్యక్తి నిషిద్ద జేషే మహ్మద్ కు చెందిన టెర్రరిస్టుగా(Jaish Terrorist Killed) గుర్తించారు.
షోపియాన్ లోని కప్రేన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ముందస్తుగా ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా బలగాలు. సెర్చ్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఆత్మ రక్షణలో పడిన దళాలు ఫైరింగ్ చేయడంతో టెర్రరిస్టు ప్రాణాలు కోల్పోయాడు.
ఇదిలా ఉండగా భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఖతమైన ఉగ్రవాదిని కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్ గా గుర్తించారు. అతను గత కొంత కాలంగా కుల్గామ్ షోపియాన్ ప్రాంతంలో చురుకుగా పాల్గొన్నాడని జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా షోపియాన్ జిల్లాలో కుప్రేన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇప్పటికే పలు చోట్ల ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడ్డారు. ప్రధానంగా కాశ్మీరీ పండిట్లపై కాల్పులకు తెగబడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. భద్రత ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఎవరినీ ఉపేక్షించ వద్దని ఆదేశించారు షా.
Also Read : యుఎస్ వీసా కావాలంటే ఆగాల్సిందే