Janet Yellen : భారత్..అమెరికా సహజ మిత్రులు – యెల్లెన్
యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఆసక్తికర వ్యాఖ్యలు
Janet Yellen : అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత, అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ప్రకటన చేశారు. ఇదే సమయంలో భారత్, యుఎస్ సహజ మిత్రులు అని స్పష్టం చేశారు జానెట్ యెల్లెన్(Janet Yellen). జి20 సంవత్సరానికి సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రపంచ సమన్వయాన్ని వేగవంతం చేసేందుకు అవకాశం ఉందన్నారు.
ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత దేశం ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు కీలకమైన అంశాలపై సంబంధాలు కంటిన్యూగా కొనసాగిస్తూ వచ్చాయని అన్నారు యుఎస్ ట్రెజరీ కార్యదర్శి. వరల్డ్ వైడ్ గా అస్థిరత, యుద్దం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య దేశాలు తమ పౌరులకు అందించ గలవని నిరూపితమైందన్నారు
జానెట్ ఎమ్మెస్ యెల్లెన్ శుక్రవారం నోయిడా లోని మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీలో మాట్లాడారు. భారత దేశంతో ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ప్రస్తుతం దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య ఆలోచన రెండూ అత్యంత ప్రధానమైన అంశాలు అని స్పష్టం చేశారు. గతంలో ఈ రెండు దేశాలు స్వాతంత్రం కోసం పోరాటాలు చేశాయని గుర్తు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మన వైపు చూస్తున్నారని చెప్పారు జానెట్ యెల్లెన్(Janet Yellen). ప్రజాస్వామ్యాలు తమ పౌరుల ఆర్థిక అవసరాలను తీర్చగలవా, బెదిరింపులను ఎదుర్కొని నిలవగలవా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నింటిని అధిగమించే సత్తా అమెరికా, భారత్ దేశాలకు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు.
Also Read : చైనాతో భారత్ సంబంధాలు కష్టం – జై శంకర్