PM Flags Off : చెన్నై మైసూర్ వందే భారత్ రైలు షురూ
జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
PM Flags Off : దక్షిణాదిలో మరో కొత్త మైలు రాయికి శ్రీకారం చుట్టారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మొట్ట మొదటి సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను శుక్రవారం బెంగళూరులో జెండా ఊపి(PM Flags Off) ప్రారంభించారు. ఈ వందే భారత్ రైలు మైసూరు నుంచి చెన్నికి వెళుతుంది. మరింత కనెక్టివిటిని పెంచుతుందని ఈ సందర్భంగా అన్నారు నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో ఇది ఐదోది.
కర్ణాటక రాజధాని బెంగళూరు లోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో చెన్నై – మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను స్టార్ట్ చేశారు. దక్షిణ భారతంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం. పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన చెన్నై..ఐటీకి కేరాఫ్ గా ఉన్న బెంగళూరు నగరాల మధ్య మరింత రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు ప్రధానమంత్రి. దీని వల్ల కొంత టైం కూడా సేవ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉండాలనే సదుద్దేశంతో తమ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు మోదీ. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇక బెంగళూరు నగరం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.
స్టార్టప్ లకు హబ్ గా , వినూత్నమైన ఆవిష్కరణలకు కేంద్రంగా ఉందని కొనియాడారు ప్రధానమంత్రి. అంతే కాదు పర్యాటక నగరాలుగా చెన్న పట్టణం, మైసూరు ఇప్పటికే పేరొందాయని ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఈ వందే భారత్ రైలుకు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ అని పేరు పెట్టారు.
Also Read : చెన్నైని ముంచెత్తిన వర్షం బడులు బంద్