BJP MLA Joins AAP : కమలానికి కటీఫ్ ఆప్ కు ఎమ్మెల్యే జంప్
గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యే రిజైన్
BJP MLA Joins AAP : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత పట్టు కలిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది గుజరాత్. ఆయన కలల స్వప్నం. సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఆపై దేశాన్ని గుజరాత్ మోడల్ చేస్తానని ప్రకటించారు.
ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దేశానికి ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇది పక్కన పెడితే తాజాగా గుజరాత్ లో గత 27 ఏళ్లుగా కంటిన్యూగా బీజేపీ అధికారంలో ఉంది. ముచ్చటగా మరోసారి పవర్ లోకి రావాలని పావులు కదుపుతోంది.
మొత్తం ఎన్నికల ప్రచారం, విజయం సాధించి పెట్టే బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నారు ట్రబుల్ షూటర్ అమిత్ షా. ఈ తరుణంలో గతంలో రెండు పార్టీల మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి సీన్ మారింది. ఆప్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ప్రముఖ జర్నలిస్ట్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఆప్.
ఈ తరుణంలో పవర్ లో ఉన్న బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసింహా సోలంకి కాషాయానికి కటీఫ్ చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీలో(BJP MLA Joins AAP) చేరారు. ఆప్ రాష్ట్ర చీఫ్ గోపాల్ ఇటాలియా సమక్షంలో ఆయన చీపురుకట్ట కండువా కప్పుకున్నారు.
ఇదిలా ఉండగా మాతర్ అసెంబ్లీ స్థానం నుంచి కాషాయ పార్టీ ఈసారి టికెట్ కేటాయించలేదు. దీంతో తనకు టికెట్ రాక పోవడంతో ఆ వెంటనే ఆప్ లోకి సెట్ అయ్యారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ కొనసాగనుంది.
Also Read : బరిలో నిలిచిన వారిలో ‘బడా’ బాబులే