CM KCR Modi : ప్రధాని టూర్ కు కేసీఆర్ డుమ్మా
కావాలని రాలేదంటున్న బీజేపీ
CM KCR Modi : తెలంగాణలో కీలకమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్న శుభ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టూర్ కు సీఎం కేసీఆర్(CM KCR Modi) డుమ్మా కొట్టారు. సీఎం గత కొంత కాలం నుంచి కావాలని పీఎంను అవమానిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది బీజేపీ. ఏపీలో పర్యటన ముగించుకుని తెలంగాణకు రానున్నారు.
రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా ప్రధాని టూర్ లో విధిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. దీనిని పాటించక పోవడం ఇది వరుసగా వస్తోంది. వైజాగ్ నుంచి నేరుగా బేగంపేటకు ప్రధాని వస్తారు. అక్కడ కొద్ది సేపు బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. 2.15 గంటలకు రామగుండకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు.
3.15 గంటలకు చేరుకుంటారు. ఎరువుల ఫ్యాక్టరీతో పాటు జాతీయ రహదారిని జాతికి అంకితం చేస్తారు ప్రధానమంత్రి. ఇక ప్రోటోకాల్ పాటించాల్సి ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపుతోంది ప్రభుత్వం. ప్రధాని తెలంగాణకు రానుండగా సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీకి చెక్కేశారు.
తాను ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ చిహ్నం విషయంతో పాటు తన పార్టీని విస్తరించేందుకు పలువురితో చర్చించేందుకు గాను ఢిల్లీకి బయలు దేరినట్లు సమాచారం. ప్రధాని పర్యటన సందర్భంగా రామగుండంలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు, జీఎస్టీ, వివాస్పద టెక్ ప్రాజెక్టు , ఇతర వాటిని హైలెట్ చేస్తూ నిరసన తెలుపుతోంది టీఆర్ఎస్.
Also Read : దేశ వ్యాపారానికి విశాఖ కేరాఫ్ – మోదీ