Fake Twitter Accounts : ఫేక్ ఖాతాల ఎఫెక్ట్ సబ్‌స్క్రిప్షన్ కు చెక్

తాత్కాలికంగా ర‌ద్దు చేసిన ట్విట్ట‌ర్

Fake Twitter Accounts : టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ ను రూ. 4,400 కోట్ల‌కు టేకోవ‌ర్ చేసుకున్నాక ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్న ట్విట్ట‌ర్ ప్ర‌స్తుతం తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. రోజు రోజుకు సంచ‌ల‌న , షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉద్యోగుల‌ను, యూజ‌ర్ల‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు ఎలాన్ మ‌స్క్.

న‌కిలీ ఖాతాల విష‌యంలోనే మ‌స్క్ నానా యాగి చేశాడు. త‌న‌కు గ‌తంలో ఉన్న సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ కుచ్చు మోసం చేశాడంటూ మండిప‌డ్డాడు. ఆయ‌న‌తో పాటు సీఎఫ్ఓ సెగెల్, లీగ‌ల్ హెడ్ విజ‌యా గ‌ద్దెతో పాటు ప‌లువురు టాప్ జాబ‌ర్స్ ను ఇంటికి పంపించాడు. ఈ త‌రుణంలో ట్విట్ట‌ర్ లో పెద్ద ఎత్తున న‌కిలీ ఖాతాలు(Fake Twitter Accounts) ఉన్నాయంటూ గుర్తించాడు.

వీటిని గుర్తించేందుకే స‌గం టైం స‌రిపోతుంద‌ని గుర్తించాడు ఎలాన్ మ‌స్క్.ఇక ఫేక్ అకౌంట్లు పెర‌గ‌డంతో ట్విట్ట‌ర్ రంగంలోకి దిగింది. $8 స‌బ్ స్క్రిప్ష‌న్ ప్రోగ్రామ్ ను తాత్కాలికంగా స‌స్పెండ్ చేసింది. ఇప్ప‌టికే ఉన్న ఖాతాదారులు ఇప్ప‌టికే వారి ఖాతాకు యాక్సెస్ క‌లిగి ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది ట్విట్ట‌ర్.

చెల్లింపు చందాదారుల‌ను ధృవీక‌రించేందుకు అనుమ‌తి ఇవ్వ‌డంతో ట్విట్ట‌ర్ మోస‌గాళ్ల ఖాతాల‌ను(Fake Twitter Accounts) గుర్తించే ప‌నిలో ప‌డింది. అంత‌వ‌ర‌కు స‌బ్ స్క్రిప్ష‌న్ ప్రోగ్రామ్ ను వాయిదా వేసిన‌ట్లు వెల్ల‌డించింది.

ఈ చ‌ర్య‌ను వెబ్ సైట్ ప్లాట్ ఫార్మర్ ముందుగానే నివేదించింది. ట్విట్ట‌ర్ హై ప్రొఫైల్ ఖాతాల కోసం అధికారిక బ్యాడ్జ్ ల‌ను కూడా పున‌రుద్ద‌రించింది. ఇప్ప‌టికే టాప్ ఎగ్జిక్యూటివ్ లు వైదొల‌గ‌డం ఇబ్బందిక‌రంగా మారింది.

మ‌రో వైపు 4 వేల మందిని తీసి వేశాడు మ‌స్క్. ఇంటి నుండి ప‌ని చేసేందుకు ఒప్పుకోన‌ని ప్ర‌క‌టించాడు. ఎవ‌రైనా సరే రావాల్సిందేనంటూ హెచ్చ‌రించారు. ఉచితంగా భోజ‌నం, వైఫై కూడా ఉండ‌ద‌ని హెచ్చ‌రించాడు.

Also Read : యూజ‌ర్ల‌కు ఎయిర్ టెల్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!