PM Modi : దేశ వ్యాపారానికి విశాఖ కేరాఫ్ – మోదీ
త్వరలోనే ఏపీకి మంచి రోజులు
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీని ఆయన ఆకాశానికి ఎత్తేశారు. శనివారం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశానికి సంబంధించిన వ్యాపారానికి విశాఖ కేరాఫ్ గా మారిందన్నారు మోదీ. తాము పవర్ లోకి వచ్చాక దేశంలో మౌలిక సదుపాయల కల్పనకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు.
రహదారులు, ఓడ రేవులు, రైల్వేలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయని వెల్లడించారు. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ , పోర్టు వరకు ఆరు లైన్ల రహదారులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో విశాఖ చేపల రేవును ఆధునీకరించాలని కోరారని దానికి తాను హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు నరేంద్ర మోదీ.
ఇక ఏపీ తీరం అభివృద్దిలో దూసుకు పోతోందని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా రాష్ట్రానికి సంబంధించి 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని ప్రధానమంత్రి(PM Modi) స్పష్టం చేశారు. ఏపీకి చెందిన ప్రజలు అన్ని రంగాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ హరిబాబు తనతో ఎప్పుడు కలిసినా తమ రాష్ట్రం అభివృద్ది గురించి ప్రస్తావిస్తూ వుంటారని గుర్తు చేశారు నరేంద్ర మోదీ.
ప్రధానంగా మౌలిక వసతుల కల్పనతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఈ విషయాన్ని గుర్తించే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తాము చేపట్టిన డెవలప్ మెంట్ వల్ల పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. రైతులకు ప్రతి ఏటా 6 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి.
Also Read : ఇక ఏపీకి అన్నీ మంచి రోజులే – పవన్