Congress Manifesto : మోదీ స్టేడియం పేరు మారుస్తాం – కాంగ్రెస్
గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Congress Manifesto : గుజరాత్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక డిసెంబర్ 1, 5న గుజరాత్ కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి.
శనివారం గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను(Congress Manifesto) ప్రకటించింది. ప్రధానంగా రాష్ట్రంలో నిర్మించిన భారీ స్టేడియంకు ఉన్న మోదీ పేరును తాము పవర్ లోకి వచ్చిన వెంటనే మారుస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, మహిళలకు అన్ని రంగాలలో ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
నరేంద్ర మోదీ పేరు తీసేసి ఉక్కు మనిషిగా పేరొందిన దేశ మొదటి హొం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెడతామని తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఆయనే మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ, వితంతువులు, వృద్దులకు నెలకు రూ. 2,000 చొప్పున పెన్షన్ లాగా ఇస్తామని పేర్కొన్నారు.
3,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని బాలికలందరికీ ఉచితంగా పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచితంగా విద్యను అందజేస్తామని ప్రకటించారు. రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఉచిత విద్యుత్ , ప్రతి నిరుద్యోగ యువకుడికి నెల వారీగా రూ. 3,000 ఇస్తామని తెలిపింది.
గుజరాతీలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య తనిఖీకి అందజేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో రూ. 4 లక్షల కోవిడ్ పరిహారం కూడా ఇస్తామని తెలిపింది.
Also Read : రాజీవ్ హంతకుల విడుదల దారుణం – జైరాం