Venky Ramakrishnan : వెంకీ రామకృష్ణన్ కు ఆర్డర్ ఆఫ్ మెరిట్
ప్రపంచంలోనే అద్భుతమైన పురస్కారం
Venky Ramakrishnan : నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ కు యుకె రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లభించింది. గత సెప్టెంబర్ లో మరణించే ముందు క్వీన్ ఎలిజబెత్ -2 చారిత్రాత్మక క్రమంలో చేసిన ఆరు నియామకాలలో ఒకరుగా ఉన్నారు.
ఇది ఆయనకు లభించిన అరుదైన గౌరవం. అంతే కాదు యుకె కింగ్ చార్లెస్ తో నియమించబడిన మొదటి వ్యక్తి వెంకీ రామకృష్ణన్. ఇదిలా ఉండగా వెంకీ రామకృష్ణన్ ఎవరో కాదు భారత దేశంలోని తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన ప్రొఫెసర్ గా పని చేశారు.
ఆయన స్వస్థలం చిదంబరం. అమెరికాలో జీవశాస్త్రం చదివారు. వెంకీ రామకృష్ణన్(Venky Ramakrishnan) సైన్స్ కు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను అందుకున్నారు. 70 ఏళ్ల యుకె ఆధారిత మాలిక్యులర్ బయాలజిస్ట్ ను ఎంపిక చేయడం విశేషం.
ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది యుకెలో గొప్ప పురస్కారాలలో ఒకటిగా పేరొందింది. కాగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది బ్రిటీష్ సార్వభౌమాధికారి అందించే ప్రత్యేక గౌరవ చిహ్నం.
సాయుధ దళాలు, సైన్స్ , కళ, సాహిత్యం లేదా సంస్కృతిని ప్రోత్సహించడం కోసం విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆర్డర్ కు నియామకాలు జరిగాయని బకింగ్ హొమ్ ప్యాలెస్ ప్రకటించింది.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఆరుగురిని క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ ప్రారంభంలో ఎంపిక చేశారని పేర్కొంది. వెంకీ రామకృష్ణన్ రైబోసోమల్ నిర్మాణంపై చేసిన కృషికి 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని(Nobel Prize) అందుకున్నారు.
అత్యున్నతమైన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను పొందడంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు. యుకె ప్రధాని రిషి సునక్ అభినందించారు.
Also Read : తెలుగు భాషా వైభవం బ్రౌన్ స్మృతి పథం