Jai Shankar : ఉక్రెయిన్ మంత్రి కులేబాతో జై శంక‌ర్ భేటీ

యుద్ద విర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నం చేయాలి

Jai Shankar : భార‌త దేశం విదేశాంగ విధానం ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం యావ‌త్ లోకాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది ర‌ష్యా ఉక్రెయిన్ పై కంటిన్యూగా యుద్దం చేస్తూ వ‌స్తోంది. ఈ త‌రుణంలో మొద‌టి నుంచీ భార‌త్ ఇరు దేశాల‌ను యుద్దం ఆపాలంటూ కోరుతోంది.

ఇదే విష‌యాన్ని ఐక్యరాజ్యస‌మితి స‌ర్వ స‌భ్య స‌మావేశాన్ని నిర్వ‌హించింది యుద్దం దాని కార‌ణంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై. ఈ సంద‌ర్భంగా భార‌త దేశం ఒక‌టే కోరింది. ప్ర‌పంచానికి శాంతి త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని పేర్కొంది. ఆనాటి గాంధీ నుంచి నేటి మోదీ దాకా యుద్దం వ‌ద్దంటూ స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం భార‌త్ ర‌ష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తోంది. దీనిని తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది అమెరికా. ఇదే క్ర‌మంలో భార‌త్ అన్ని దేశాల కంటే ముందు అడుగు వేసింది. శ‌నివారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఉక్రెయిన్ మంత్రి కౌంట‌ర్ డిమిట్రో కులేబాతో క‌లిశారు.

అంత‌కు ముందు రెండు రోజులు ప‌ర్య‌టించార ర‌ష్యాను. ఈ మేర‌కు యుద్దం వెంట‌నే విర‌మించు కోవాల‌ని ఈ మేర‌కు ఇరు ప‌క్షాలు స‌యోధ్య‌కు రావాల‌ని సూచించారు. ఇందుకు వీలైతే చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(Jai Shankar).

ఇరువురు నాయ‌కులు ఈ ప్రాంతంలో ఇటీవ‌లి చోటు చేసుకున్న పరిణామాలు, అణు ఆందోళ‌నలు ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దాన్ని ముగించే మార్గాల‌పై చ‌ర్చించారు.

Also Read : భార‌త్ యుకె మ‌ధ్య బంధం ప‌టిష్టం – జాన్స‌న్

Leave A Reply

Your Email Id will not be published!