Prashant Kishor : పోటీ అబద్దం ప్రత్యామ్నాయం నిజం – పీకే
బీహార్ పాదయాత్రలో స్ట్రాటజిస్ట్ ఫుల్ బిజీ
Prashant Kishor : ప్రముఖ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే క్రమంలో రాష్ట్రంలో కొలువు తీరిన జేడీయూ మహా ఘట్ బంధన్ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు. గతంలో ఆయన జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్ తో విభేదించారు. ఆపై మళ్లీ తన వృత్తిని చేపట్టారు. ఏపీలో, పశ్చిమ బెంగాల్ లో, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు పని చేశారు.
ఆ మూడు పార్టీలు ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ తరుణంలో ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు రాజకీయ చాతుర్యం ఎక్కువగా ఉందంటూ జేడీయూ నాయకులు కామెంట్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
తాను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదన్నారు. కానీ జేడీయూకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఒకవేళ తాను వ్యాపారం చేస్తున్నట్లయితే సీఎం నితీశ్ కుమార్ తన వద్ద ఎందుకు పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్. నేను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు.
పశ్చిమ చంపారన్ లో జరగనున్న సదస్సులో జన్ సురాజ్ ప్రచారాన్ని రాజకీయ పార్టీగా చేయాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) .
Also Read : గుజరాత్ మోడల్ ను ద్వేషించండి – మహూవా