PM Modi : ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదం – మోదీ
ఉమ్మడి పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపు
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యగా పేర్కొన్నారు. అన్ని ఉగ్రదాడులు సమాన ఆగ్రహానికి అర్హమైనవి అని అన్నారు పీఎం. దశాబ్దాలుగా ఉగ్రవాదం వివిధ రూపాల్లో, వివిధ సందర్భాల్లో పేర్లు మార్చుకుంటూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే టెర్రిరస్టుల అనాలోచిల చర్యల కారణంగా వందలాది మందిని కోల్పోయామని వాపోయారు నరేంద్ర మోదీ(PM Modi) . అయినప్పటికీ భారత దేశం ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడే టెక్నాలజీ మరింత విస్తృతంగా మారింది. దీనిని కూడా ఉగ్రవాదులు ఉపయోగించుకుంటూ దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
వాటిని గుర్తించడం అత్యంత సవాల్ గా మారిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి. ఇప్పటికే కేంద్ర హోం శాఖ జల్లెడ పడుతోందన్నారు. ఆర్మీ రేయింబవళ్లు శ్రమిస్తోందని కొనియాడారు నరేంద్ర మోదీ. మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై ఉగ్రవాదం దాడిగా అభివర్ణించారు.
ప్రస్తుతం ఆయుధాలు, మిస్సైళ్లు, ఇతర వాటి కంటే టెర్రరిజం అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఇదిలా ఉండగా మోదీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం తీవ్రంగా పరిగణించక ముందే మన దేశం ఉగ్రవాదానికి సంబంధించిన చీకటి ముఖాన్ని చూసిందన్నారు.
గతం నుంచి నేటి దాకా ఎన్నో రూపాలలో భారత దేశాన్ని అస్థిర పరిచేందుకు ఉగ్రవాద శక్తులు ప్రయత్నం చేశాయని కానీ వారి ఆటలు సాగలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ తో పాటు అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనని పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి.
Also Read : త్రిష్నీత్ అరోరాకు కమలా హారిస్ పిలుపు