Prashant Kishor : కొలువుల కోసం ప్రభుత్వంపై యుద్దం – పీకే
మరోసారి బీహార్ సీఎంపై ఆగ్రహం
Prashant Kishor : బీహార్ లో ప్రస్తుతం జేడీయూ సంకీర్ణ సర్కార్ కు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఆయన బీహార్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత సర్కార్ ను టార్గెట్ చేశారు.
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ నిలదీస్తున్నారు. 2020 లో జరిగిన ఎన్నికల్లో 10 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదంటూ ధ్వజమెత్తారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). ఆదివారం ఆయన మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను వేలెత్తి చూపారు.
పదే పదే ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఇదే సమయంలో తాము ప్రకటించిన ఉద్యోగాల భర్తీని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని పీకే డిమాండ్ చేశారు. తక్షణమే యుద్ద ప్రాతిపదికన కొలువులను నింపాలని లేక పోతే ఎక్కడికక్కడ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను నిరుద్యోగులే అడ్డుకుంటారని హెచ్చరించారు.
మరో వైపు జేడీయూ నేతలు మాత్రం పీకేను విమర్శిస్తున్నారు. ఆయన రాష్ట్రం కోసం పని చేయడం లేదని కేవలం బీజేపీకి మేలు చేకూర్చేందుకు పని చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
దీనిపై నిప్పులు చెరిగారు పీకే. తాను అలా చేసే వాడినైతే నితీశ్ కుమార్ ఎందుకు చేర్చుకున్నారంటూ ప్రశ్నించారు. మరో వైపు సంకీర్ణ సర్కార్ లో కీలకంగా ఉన్న జేడీయూ చీఫ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని అన్నారు. మొత్తంగా పీకే వర్సెస్ సీఎంగా మారింది.
Also Read : కాంగ్రెస్ కు చేటు ‘మర్రి’పై వేటు