ADGP Alok Kumar : ఐఎస్ఎస్ఐ ప్రభావంతో మంగళూరు బ్లాస్ట్
మంగళూరు పేలుడు ఘటన కేసు
ADGP Alok Kumar : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కర్ణాటక లోని మంగళూరు ఆటో రిక్షా పేలుడు ఘటన. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరో ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సంఘటన చోటు చేసుకున్న వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ , రాష్ట్ర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన సూత్రధారిగా షకీర్ ఉన్నట్లు గుర్తించారు.
అతడు నెల కిందట మొబైల్ టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని ఇల్లు అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ స్పూర్తితో ఈ పేలుడుకు ప్లాన్ చేశాడని చెప్పారు. ఇప్పటి వరకు కర్ణాటక లోని అయిదు ప్రాంతాల్లో సోదాలు చేపట్టామన్నారు.
మైసూరు లోని అతడి ఇంటితో పాటు బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రేరణ పొందాడని, డార్క్ వెబ్ ను ఉపయోగించి తన హ్యాండ్లర్ లను సంప్రదించాడని చెప్పారు. ఈ కేసులో భారీ పురోగతిని సాధించామని తెలిపారు పోలీసులు. షరీఖ్ పలు హ్యాండర్ల కింద పని చేశాడన్నారు.
వారిలో ఒకరు ఐఎస్ఐఎస్ ప్రభావానికి లోనైన అల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని కర్ణాటక పోలీసు(ADGP Alok Kumar) ఉన్నతాధికారి అలోక్ కుమార్ వెల్లడించారు. శివమొగ్గ జిల్లాకు చెందిన షరీఖ్ ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ లో ఐఈడీని తీసుకు వెళుతుండగా పేలిందన్నారు.
ప్రస్తుతం షరీఖ్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. షరీఖ్ తక్షణ హ్యాండ్లర్ అరాఫత్ అలీ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు. అల్ హింద్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్న ముస్సావిర్ హుస్సేన్ తో టచ్ లో ఉన్నాడని చెప్పారు.
Also Read : నారాయణ్ జగదీశన్ సెన్సేషన్