Revanth Reddy : ధ‌ర‌ణి ఓ స్కాం రైతులు ఆగ‌మాగం – రేవంత్

నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్

Revanth Reddy : ధ‌ర‌ణి పోర్టల్ కాద‌ది భారీ స్కాం అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎంను మెప్పించిన ఓ ఏజెన్సీ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను చేప‌ట్టింద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆస్తుల వివ‌రాల‌ను గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వం అప్ప‌నంగా ప్రైవేట్ ప‌రుల చేతుల్లోకి పెట్టింద‌ని ఆరోపించారు.

దీంతో కోటిన్న‌ర ఎక‌రాల‌కు పైగా రైతుల‌కు సంబంధించిన భూములు ఆగ‌మైన‌ట్లు మండిప‌డ్డారు. వీటికి సంబంధించిన వివ‌రాలు క‌నిపించ‌కుండా పోయాయ‌ని దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). భూములున్న వారంతా ఏక‌మై దీనిపై పోరాడాల‌ని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.

తెలంగాణ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా రైతు బంధు, స‌బ్సిడీ విత్త‌నాలు, బ్యాంకు రుణాలు రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు రుణ మాఫీ చేయాల‌ని, పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం దిగి రాక పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 24న ఎమ్మార్వో ఆఫీసుల వ‌ద్ద రైతుల‌తో క‌లిసి ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

అంతే కాకుండా 30న శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు, డిసెంబ‌ర్ 5న అన్ని జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న చేప‌డ‌తామ‌ని చెప్పారు.
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

గ‌త ఎనిమిదేళ్లుగా ప్ర‌జ‌ల‌కు దూరంగా సీఎం పాల‌న సాగిస్తున్నారంటూ మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Also Read : ఆదివాసీలు దేశానికి య‌జ‌మానులు – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!