India Good news : ఎన్నారైలకు కేంద్రం ఖుష్ కబర్
సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం లేదు
India Good News : ప్రవాస భారతీయులకు కేంద్ర సర్కార్ తీపి కబురు(India Good News) చెప్పింది. ఇక నుంచి విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు నిరభ్యంతరంగా భారత్ కు రావచ్చని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా కరోనా దెబ్బకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎవరైనా ఇండియాకు రావాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది.
మాస్క్ లు ధరించడం, వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా పొందు పర్చాల్సి ఉండేది. అంతే కాదు ఎయిర్ సువిధ పేరుతో సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం విధిగా అందజేస్తేనే దేశంలోకి ప్రవేశం లభించేది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తో పాటు మాస్క్ కంపల్సరీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండడంతో మాస్క్ తో పాటు ఎయిర్ సువిధ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం మాండిటరీ (తప్పనిసరి) కాదంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ అధికారికంగా వెల్లడించింది.
దీని వల్ల ప్రవాస భారతీయులకు ఇబ్బందులు తప్పినట్టే. ఎందుకంటే వేలాది మంది కరోనా దెబ్బకు తమ దేశానికి రాకుండా ఉండి పోయారు. అటు విదేశాల్లో ఉండలేక ఇటు స్వంత దేశం భారత్ కు రాలేక కుమిలి పోయారు. మరికొందరు రాలి పోయారు కూడా. ఇక నుంచి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది కేంద్ర సర్కార్.
ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలు అక్కర్లేదంటూ పేర్కొంది. అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకుంటే బెటర్ అని సూచించింది. విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కూడా తొలగించింది.
Also Read : ‘ఐ లవ్ యూ రస్నా’ను మరిచి పోలేం