Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసు డిసెంబర్ 5కు వాయిదా
శరత్ చంద్రా రెడ్డి..బినోయ్ బాబుకు 14 రోజుల కస్టడీ
Delhi Liquor Scam : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకు విచారణలో కొత్త లింకులు బయట పడుతున్నాయి. నిన్నటి దాకా దొరలుగా చెలామణి అయిన వాళ్లంతా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటుండడం విశేషం. అధికారంలో ఉన్న వారితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం షరా మామూలై పోయింది.
ఇక ఎప్పటి లాగే చిలుక పలుకులు పలుకుతూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చుక్కలు చూపిస్తున్నారు. ఆయన కొట్టిన దెబ్బకు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) వెలుగు చూసింది. విచారణకు ఆదేశించడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.
ఢిల్లీలో మద్యం వ్యాపారం..కానీ లింకులు మొత్తం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉండడం విస్తు పోయేలా చేసింది. ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిని అరెస్ట్ చేసింది. దీంతో దెబ్బకు అసలు లింకు బయట పడింది.
ఆయనతో పాటు భార్య కనికా రెడ్డిని కూడా ప్రశ్నించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడిగా పేరొందిన బోయినపల్లి అభిషేక్ రావు, శ్రీనివాసరావుతో పాటు విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. ఇదే సమయంలో బినోయ్ బాబును కూడా అరెస్ట్ చేశారు. తాజాగా శరత్ చంద్రా రెడ్డితో పాటు బినోయ్ బాబుకు సీబీఐ కోర్టు 14 రోజుల పాటు కస్టడీకి తరలించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును కోర్టు డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
Also Read : లిక్కర్ స్కాంలో ముదుర్లు బెయిల్ వద్దు