AAP MLA Beaten : ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ పై దాడి
పరుగులు తీసిన వీడియో వైరల్
AAP MLA Beaten : ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గులాబ్ సింగ్ యాదవ్ దాడికి గురయ్యాడు. తనను తాను రక్షించుకునేందుకు పరుగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో , ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధంచి అభ్యర్థులు ఎవరనే విషయమై ఆప్ ఎమ్మెల్యేకు(AAP MLA Beaten) , కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం వెంటనే స్పందించింది పౌర ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ టికెట్లను అమ్ముకుంటోందంటూ ఆరోపించింది.
ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యమని పేర్కొంది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ పై జరిగిన దాడి గురించి ఇంకా స్పందించ లేదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలోని మటియాలా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు యాదవ్. సోమవారం రాత్రి పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో కోపోద్రోక్తులైన కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడి చేయడం, కాలర్ పట్టు కోవడం, నెట్టడం ప్రారంభించారు. గులాబ్ సింగ్ యాదవ్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అతడిపై దెబ్బల వర్షం కురిపించారు.
ఎట్టకేలకు ఎమ్మెల్యే పరుగులు తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్లు అమ్ముకున్నాడనే ఆరోపణలపై ఆప్ కార్యకర్తలు గోపాల్ సింగ్ యాదవ్ ను కొట్టారని బీజేపీ ఢిల్లీ యూనిట్ ఆరోపించింది.
Also Read : లిక్కర్ స్కాం కేసు డిసెంబర్ 5కు వాయిదా