IT Raids Mallareddy : మంత్రి మ‌ల్లారెడ్డికి ఐటీ బిగ్ షాక్

కొన‌సాగుతున్న ఐటీ సోదాలు

IT Raids Mallareddy : రాష్ట్రంలో కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వానికి చెక్ పెట్టింది కేంద్రం. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి సీఎం కేసీఆర్ త‌న‌య ఎమ్మెల్సీ క‌విత అనుచ‌రుడిగా ఉన్న బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసింది.

తాజాగా సీఎంకు అనుచ‌రుడిగా, కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న మ‌ల్లారెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మ‌ల్లారెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఏకంగా 50 చోట్ల ఐటీ దాడులు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. విచిత్రం ఏమిటంటే తెల్ల‌వారుజామున నిద్ర‌లో ఉండ‌గానే భారీ ఎత్తున ఐటీ, సీఆర్పీఎఫ్ భ‌ద్ర‌త‌తో సోదాలు చేప‌ట్ట‌డం విస్తు పోయేలా చేసింది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఐటీ సోదాలు కొన‌సాగుతున్నాయి. మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డికి(IT Raids Mallareddy) చెందిన భ‌వ‌నాలు , కార్యాల‌యాలు, యూనివ‌ర్శిటీ, ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ఐటీ సోదాలు నిర్వ‌హించారు. మంత్రికి చెందిన హైద‌రాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు.

ఇందులో మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డికి చెందిన కూతురు, త‌న‌యులు మ‌హేంద‌ర్ రెడ్డి, భ‌ద్రారెడ్డి, అల్లుళ్లు, కుటుంబ బంధువులకు చెందిన నివాసాలాతో పాటు దాడులు జ‌రుగుతున్నాయి. అంతే కాదు మ‌ల్లారెడ్డి సోద‌రుల ఇళ్ల‌పై కూడా సోదాలు ముమ్మ‌రం చేశారు.

మొత్తంగా ఇది మంత్రి చామ‌కూరుకు చుక్క‌లు చూపిస్తున్నారు. కాలేజీలే కాదు మ‌ల్లారెడ్డి కుటుంబీకులు, బంధుగ‌ణం అంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందుకే పూర్తి స‌మాచారంతో ఐటీ దాడికి దిగింది.

మంత్రిపై ఐటీ సోదాలు జ‌ర‌గ‌డంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌డం విశేషం.

Also Read : ధ‌ర‌ణి ఓ స్కాం రైతులు ఆగ‌మాగం – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!