Rashtrapati Bhavan Open : రాష్ట్రపతి భవన్ సందర్శనకు రెడీ
డిసెంబర్ 1 నుంచి వారానికి ఐదు రోజులు
Rashtrapati Bhavan Open : భారత దేశ రాష్ట్రపతి భవన్ ను సందర్శించాలని అనుకునే వాళ్లకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర పతి భవన్ డిసెంబర్ 1 నుంచి వారానికి 5 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం కీలక ప్రకటన చేసింది.
సందర్శకుల కోసం గతంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఐదు రోజులు చేసింది. రాష్ట్రపతి భవన్ చేసిన ప్రకటన మేరకు ప్రతి వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో ప్రజలకు అందుబాటులో(Rashtrapati Bhavan Open) ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక నుంచి ఐదు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా గత రెండు ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది.
దీంతో రాష్ట్రపతి భవన్ సందర్శించాలని అనుకునే ప్రజలకు కేవలం రెండు రోజులు మాత్రమే పర్మషన్ ఉండేది. ప్రెసిడెంట్ కు సంబంధించిన అధికారిక నివాసాన్ని ప్రజలకు మరింత అందుబాటులో ఉంచాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల నుంచి ఐదు రోజులకు పెంచడం జరిగిందని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
సందర్శకులు ప్రధాన భవనంతో పాటు ల్రైబ్రరీ మొదలైన వాటిని ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు చూసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా రాష్ట్రపతి భవన్ చూడాలని అనుకునే వారికి ఈ వార్త సంతోషం కలిగించింది.
Also Read : జాతీయ పెన్షన్ పథకం ఓ వరం