AWS Launches : భాగ్య‌న‌గ‌రంలో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్

2030 నాటికి 48 వేల ఉద్యోగాల క‌ల్ప‌న

AWS Launches : ప్ర‌పంచంలోనే పేరొందిన ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ హైద‌రాబాద్ న‌గ‌రంలో వెబ్ స‌ర్వీసెస్ సెంట‌ర్ ను ప్రారంభించింది. భార‌త దేశంలో రెండో అతి పెద్ద అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్(AWS Launches) రీజియ‌న్ సెంట‌ర్ ను ప్రారంభించిన‌ట్లు అమెజాన్ సంస్థ ఆసియా ఫ‌సిఫిక్ రీజియ‌న్ వెల్ల‌డించింది.

వ‌చ్చే 2030 నాటికి దాదాపు రూ. 36,300 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీటి వ‌ల్ల ఏడాదికి క‌నీసం 48 వేల ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా సంతోషం వ్య‌క్తం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. అమెజాన్ చేసిన కీల‌క ప్ర‌క‌ట‌నను తాము స్వాగ‌తిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ సెంట‌ర్ వ‌ల్ల హైద‌రాబాద్ కు మ‌రింత పేరు తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌గ‌తి శీల డేటా సెంట‌ర్ హ‌బ్ గా తెలంగాణ స్థానం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఐటీ పాలసీని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తోంది.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , త‌ద‌త‌ర రంగాల‌లో టాప్ లో ఉంది. అంతే కాదు ఏకంగా 1500 కంపెనీలు ఇక్క‌డ ఏర్పాటు అయ్యాయి. ఆపై ఆయా కంపెనీల‌లో దాదాపు 7 ల‌క్ష‌ల మంది దాకా ప‌ని చేస్తుండ‌డం విశేషం. రాష్ట్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక‌, ఐటీ పాలసీలో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చింది.

ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబుడులు వ‌చ్చేందుకు మార్గం ఏర్ప‌డ్డాయి.

Also Read : ఐటీ రంగానికి ఢోకా లేదు – గోపాల‌కృష్ణ‌న్

Leave A Reply

Your Email Id will not be published!