YS Sharmila : కల్లు గీత కార్మికుల గోస పట్టని కేసీఆర్
నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
YS Sharmila : రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఒక్కరే సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి.
దీంతో కేవలం సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తెలంగాణలో సగం పూర్తి చేశారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఆమె చలించి పోయారు.
ఊరూరా బెల్టు షాపులు తెచ్చి కార్మికుల పొట్ట కొట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు. సోయి లేకుండా పాలన సాగిస్తున్న సీఎంకు కల్లు గీత కార్మికులు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. చెట్టు మీద నుండి పడి పోతే కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించ లేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.
అసలు రాష్ట్రంలో పాలన సాగుతోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కోట్లు, ఓట్లు మాత్రమే కేసీఆర్(CM KCR) కు కావాలని ప్రజా సమస్యలు పట్టవన్నారు వైఎస్ షర్మిల. మద్యం దుకాణాలు తెరిచారని కానీ విద్య, వైద్యాన్ని విస్మరించారని మండిపడ్డారు. విద్యను నాశనం చేశారని, ఆరోగ్యం అందని ద్రాక్ష పండు లాగా మార్చేశారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల.
కుల వృత్తులంటూ వారిని చదువుకు దూరంగా పెడితే ఎలా అని నిలదీశారు సీఎం కేసీఆర్ ను.
Also Read : జయశంకర్ సార్ ఊరును విస్మరించిన కేసీఆర్